అమెరికా బాటలోనే పయనిస్తున్న బ్రిటన్ కూడా అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ వలసదారులను నియమించుకునే వ్యాపార సంస్థలపై ఇటీవల కాలంలో నిర్వహించిన రెయిడ్‌లు విజయవంతం అయ్యాయయని అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసల విభాగం అధికారులు ఏకంగా 5 వేల సార్లు రెయిడ్లు నిర్వహించారని పేర్కొంది. అక్రమ వలసదారులకు పని కల్పించే నెయిల్ బార్స్, షాపులు, వేప్ షాపులు, రెస్టారెంట్లు, కార్ వాష్ షాపుల్లో మెరుపు తనిఖీలు నిర్వహించి 4 వేల అరెస్టులు చేసినట్టు పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే అధికంగా అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. ఈ కాలంలో మొత్తం 16 వేల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్టు కూడా వెల్లడించింది. అక్రమ వలసదారులను సొంత దేశాలకు తరలిస్తున్న వీడియో ఒకటి విడుదల చేద్దామని యూకే ప్రభుత్వం భావిస్తుండగా అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
![]() |
![]() |