వాట్సాప్ ద్వారా జీరో-క్లిక్ హ్యాక్ విధానంలో యూజర్ ఏ లింక్‌పై క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అవుతోందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఈ అధునాతన స్పైవేర్ దాడి కారణంగా తీవ్రమైన భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం మోస్ట్ డేంజరస్ సైబర్ గూఢచారులు కనీసం 24 దేశాలలోని వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు నిరూపణ అయింది. ఇటలీలో ఇలాంటివే ఏడు కేసులు నిర్ధారణ అయ్యాయి.ఆ వెంటనే మెటా కూడా స్పందించి.. ఇటలీ జాతీయ సైబర్ భద్రతా సంస్థను అప్రమత్తం చేసింది.వాట్సాప్ యూజర్లను హ్యాక్ చేసేందుకు ఇజ్రాయెల్ స్పైవేర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ పారగాన్ సొల్యూషన్స్‌తో లింక్ అయిన స్పైవేర్‌ను ఉపయోగించి జర్నలిస్టులు, కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేశారు. "జీరో-క్లిక్" హ్యాకింగ్ టెక్నిక్‌తో బాధితుడు ఏ చర్య చేయకున్నా వారి పరికరం హ్యాక్ అవుతుంది. ఈ రకం హ్యాకింగ్ అత్యంత మాదకరమైనదిగా పరిగణిస్తున్నారు.
![]() |
![]() |