కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తాను ఉపాధ్యాయుల సమస్యలపై, ముఖ్యంగా సిపిఎస్, పండిట్స్, పిఈటిల అప్‌గ్రేడేషన్ వంటి తీవ్ర సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి ఒక ప్రయివేట్ పాఠశాలను స్థాపించి విద్యా సేవలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవంలో రాష్ట్రంలో పట్టభద్రులైన యువనేస్తాల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించానని, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రయివేట్ పాఠశాలల సంఘం, డాక్టర్లు, లాయర్లు, పెన్షనర్ల సంఘాలు బలపర్చిన అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు నిరుద్యోగ యువత, ప్రభుత్వ, ప్రయివేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టబద్రులు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కోరారు. విలేకరుల సమావేశంలో అమరావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొనకళ్ల రెడ్డెమ్మ, ప్రయివేట్ పాఠశాలల సంఘం జిల్లా కార్యదర్శి వై.సూరిబాబు, బీసీ ఐక్యవేదిక జోగి నాగేశ్వరరావు, పిఈటి అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ సుధాకర్, ఎస్.వెంకటేశ్వరరావు, సీహెచ్ వెంకటేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, శేషాద్రిరావు, దుర్గారావు, శ్యామ్, విజయవర్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa