మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలతో దుర్గాఘాట్, భవానీఘాట్, పున్నమీ ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి శైవక్షేత్రాలను దర్శించుకున్నారు. అందునా విజయవాడలోని స్నాన ఘాట్ల వద్ద భక్తులకు జంగమదేవరులు ఆశీర్వచనాలు అందుకోవటం కనిపించింది. పుణ్యస్నానం అనంతరం భక్తులు దానధర్మాలు చేసారు.. గోశాలల వద్ద గోపూజలను నిర్వహించారు.. శివరాత్రి పర్వదినంతో వేలాదిగా తరలివస్తున్న భక్తులతో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయం, ఇంద్రకీలాద్రి దిగువున ఉన్న విజయేశ్వరాలయం, యనమలకుదరు శివాలయాలు కిటకిటలాడాయి. శివరాత్రి జాగరణలకోసం అనేక మంధి భక్తులు ఇక్కడ కొండపైకి చేరుకోవటంతో. హరహర మహాదేవ శంభో..శంకరా అంటూ భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa