నేడు ప్రతి ఒక్కర్నీ వెంటాడుతున్న సమస్య నోటి దుర్వాసన. కొన్నిసార్లు ఎంతగా తోమినా నోటి నుండి వాసన వస్తుంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. నోటి నుంచి వాసన వస్తుంటే అది బయటికి వెళ్లినప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు అయినా కూడా సమస్య ఇబ్బందిగా ఉంటుంది. నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోవడం, అవి వాయువులని ఉత్పత్తి చేయడం వల్ల ఇలా వాసన వస్తుంది. మనం తినే ఫుడ్స్ కూడా చక్కెరలు, పిండి పదార్థాలను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసినప్పుడే దుర్వాసన వస్తుంది. దీంతో పాటు చిగుళ్ల సమస్యలు, దంతక్షయం వంటి దంత సమస్యల కారణంగా కూడా నోటి దుర్వాసనకి కారణం. ఈ వాసనలని దూరం చేసుకోవాలంటే రెగ్యులర్‌గా డెంటల్ చెకప్స్ చేసుకోవాలి. అదే విధంగా, కొంతమంది మంచి మౌత్‌ఫ్రెషనర్స్ వాడతారు. బయట కొనుక్కొచ్చినవి కాకుండా సహజంగా ఇంట్లోనే కొన్ని ఫ్రెషనర్స్‌లా వాడొచ్చు. అవేంటో తెలుసుకోండి.
లవంగాలు
మన కిచెన్‌లోనే దొరికే ఈ లవంగాలు చెడు వాసనని దూరం చేసి చిగుళ్ల సమస్యల్ని దూరం చేస్తాయి. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి దంత సమస్యల్ని దూరం చేసి బ్లీడింగ్, దుర్వాసనని దూరం చేస్తాయి. దీనికోసం ఓ లవంగాన్ని నోటిలో వేసుకుని నములుతూ ఉండండి. దీని వల్ల చెడు వాసన దూరమవుతుంది.
ఉప్పు నీరు
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఈ నీటితో నోటిని పుక్కిలించండి. దీనిని పుక్కిలించడం వల్ల బ్యాక్టీరియా ఫ్లష్ అవుతుంది. దీనికోసం పావు టీ స్పూన్ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపండి. ఈ నీటితో పుక్కిలించండి. సమస్య మాయమవుతుంది.
దాల్చినచెక్క
తియ్యని రుచిగా ఉండే దాల్చిన చెక్క కూడా దంత సమస్యల్ని దూరం చేసి నోటి దుర్వాసనని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనికోసం దాల్చిన చెక్క ముక్కని నోటిలో వేసుకుని నములుతూ ఆ రసాన్ని మింగాలి. దీంతో దుర్వాసన దూరమవుతుంది.
తేనె, దాల్చిన చెక్క
ఈ రెండింటిలోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. చిగుళ్లు బలంగా మారతాయి. దీనికోసం ముందుగా దాల్చిన చెక్కని పొడిలా చేసి అందులో కొద్దిగా తేనె వేసి పేస్టులా చేయాలి. దీని వల్ల దంతక్ష్యం, చిగుళ్ల రక్తస్రావం వంటివి దూరమవుతాయి. ఇవి రెండు కూడా ఇంట్లోనే ఉటాయి. కాబట్టి, హ్యాపీగా వాడుకోవచ్చు.
నీరు తాగడం
తక్కువగా నీరు తాగడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన రావడానికి కారణమవుతుంది. మనం నీరు తాగినప్పుడు బ్యాక్టీరియా ఫ్లష్ అవుతుంది. దీని వల్ల శ్వాస ఫ్రెష్‌గా ఉంటుంది. మీరు గనక నోటి నుంచి వాసన వస్తుందని ఫీలైతే ఎక్కువగా నీటిని తాగండి. ఇందులో సగం నిమ్మకాయని పిండి ఆ నీటిని తాగితే తాజా వాసన వస్తుంది.
![]() |
![]() |