విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ లో డిమాండ్ చేసినట్లు వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ... వీటిని గురించి మేం మాట్లాడుతుంటే తెలుగుదేశం ఎంపీలు మాపైన విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. ఢిల్లీకి వచ్చి, పార్లమెంట్ లో మాపైన తిట్లవర్షం కురిపించేందుకు తమ సమయాన్ని కేటాయించకుండా రాష్ట్ర సమస్యలపై వినియోగించాలని కూడా వారికి విజప్తి చేస్తున్నాం. రాష్ట్ర సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్రంను ప్రశ్నించడానికి సిద్దమైతే రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం మీతో నిలబడతామని కూడా చెప్పాం. పోలవరం గురించి కేంద్రాన్ని ధైర్యంగా ప్రశ్నించే క్రమంలో మీ వెనుక వస్తామని కూడా చెప్పాం.
కానీ తెలుగుదేశం ఎంపీలు ప్రజాసమస్యల కన్నా మాపైన విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు. కడప ఉక్కు పరిశ్రమపై విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చి కూడా ముందుకు రాకపోతే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గారు జిందాల్ సంస్థను ఒప్పించి కడపలో శంకుస్థాపన చేయించారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జిందాల్ పై తప్పుడు కేసులు పెట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు. అదే జిందాల్ మహారాష్ట్రకు వెళ్ళి మూడు వేల కోట్లతో పరిశ్రమ పెడుతున్నారు. చంద్రబాబు రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. వీటిని ఏ అవసరాలకు ఖర్చు చేస్తున్నారో తెలియదు అని అన్నారు.
![]() |
![]() |