రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటంలో కూటమి పార్టీ ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రం నుంచి మెడికల్ విద్య కోసం అధిక ఫీజులను చెల్లిస్తూ విదేశాలకు వెళ్ళి విద్యార్ధులు చదువుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 75 వేల కోట్ల మెడికల్ సీట్లను తీసుకువస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో వైయస్ జగన్‌గారి హయాంలో ప్రారంభించిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేసింది. వాటిని పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. విద్యార్ధుల ప్రయెజనాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీశాం.
కేవలం ఆర్థిక సాయమే కాకుండా ఉక్కు కర్మాగారం భవిష్యత్ దృష్ట్యా కాప్టివ్ మైన్స్ ఇవ్వాలని కోరాం. విశాఖపట్నం రైల్వేజోన్ కోసం గత అయిదేళ్ళలో సీఎంగా వైయస్ జగన్‌గారి నేతృత్వంలో ఎంపీల బృందం కేంద్రాన్ని పలుమార్లు కలిసింది. ఇప్పుడు రైల్వేజోన్ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. వాల్తేర్ డివిజన్ పూర్తిగా జోన్‌లో ఉండాలని కోరుకుంటున్నాం. దీనిని విభజించడానికి జీఓ కూడా ఇచ్చారు. దీనిని కూడా అడ్డుకునేందుకు ఉభయ పార్లమెంట్ సభల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకనే వరకు పోరాడతాం అని తెలిపారు.
![]() |
![]() |