అన్న క్యాంటీన్లకు సమాజంలో సలహా కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణలో దాతలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాతలు నేరుగా వచ్చి అన్న క్యాంటీన్‌లో వడ్డించడం లేదా వాళ్ల పేరుపై ప్రభుత్వ కార్యక్రమం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నగరాలు, పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ శాఖకు స్పష్టం చేశారు. విజయవాడలోని పబ్లిక్ టాయ్‌లెట్లు పాడయ్యాయని, నిర్వహణను కొత్త ఏజెన్సీలకు ఇవ్వాలన్నారు. గాలి కాలుష్యంలో విజయవాడ 6వ, విశాఖపట్నం 28వ స్థానంలో ఉందని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురే్‌షకుమార్ ఈ సందర్భంగా ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గాలి, ధ్వని కాలుష్యంపై సర్వే చేయాలని సీఎం ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్ కింద 2028 నాటికి ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
![]() |
![]() |