మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయకోట పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జగన్‌కు చెక్ పెట్టేలా టీడీపీ పావులు కదుపుతోంది. ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పసుపు జెండా రెపరెపలాడింది. పులివెందులలో కూడా జగన్‌ను ఢీకొట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్రజల్లో బలం ఉన్న నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక కేడర్ సిద్ధమవుతున్నారు. పులివెందుల టీడీపీ నేతలు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులను హై కమాండ్‌కు వివరిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 30 వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు 20 కుటుంబాలు ఇవాళ(బుధవారం) టీడీపీలో చేరాయి. వీరితో పాటు పులివెందుల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.
![]() |
![]() |