ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేటా చోరీ వ్యవహారాన్ని ఈసీ పరిశీలించాలి: జీవీఎల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 06:40 PM

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డేటా చోరీ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డేటా చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేటు సంస్థకు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు.అలాగే డేటా చోరీ విషయంలో చంద్రబాబు భయపడుతున్నారని, ‘ఇది రెండురాష్ట్రాల వ్యవహారం కాదు... ప్రజలందరి వ్యక్తిగత విషయం’ అని జీవీఎల్ అన్నారు.తప్పులన్నీ టీడీపీ చేసి వేరేవారిపై ఆపాదించడం సరికాదని ఆయన అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa