ఘంటసాల మండలంలోని ఎరువులు పురుగుల మందుల షాపులను వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని రికార్డులను పరిశీలించారు.
రైతులు తప్పనిసరిగా కొనుగోళ్లకు సంబంధించి రసీదులు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే రైతు సేవా కేంద్రాలలో గాని, తమ కార్యాలయంలో గాని సంప్రదించాలని సూచించారు. ఎరువుల షాపుల యజమానులు తప్పనిసరిగా స్టాక్ బోర్డులు బయటపెట్టాలని తెలిపారు.
![]() |
![]() |