ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలాక్’ SUV బుకింగ్స్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ SUV డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1,242 కస్టమర్లు దీన్ని సొంతం చేసుకున్నారు. తక్కవ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండటం ఈ కారుకు క్రేజ్.ఈ కారుకు ఎందుకు ఇంత క్రేజ్ అంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండటం! ముఖ్యంగా స్కోడా కైలాక్ 25 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో స్కోడా కైలాక్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్ బ్యాగులు, హాట్ స్టాంప్డ్ స్టీల్ ప్యానెల్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అమర్చారు. వీటితో పాటు మల్టీ కొలిషన్ బ్రేక్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హై స్పీడ్ అలర్ట్స్, సెంట్రల్ లాకింగ్, సీట్ బెల్ట్ ప్రీటెన్షన్స్, రిమైండర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. హై ఎండ్ వేరియంట్లలో హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ అలారం, రియర్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
![]() |
![]() |