విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని.. అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా, పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ వైయస్ఆర్‌సీపీని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఫ్రీహోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. అప్పులు తేవడం, హామీల అమలు చేయకపోవడంతో పాటు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒక్క మేలు జరగలేదని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ సష్టం చేశారు.
![]() |
![]() |