ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ వేదికగా ఈ ట్రోఫీ జరగనుండగా టీమిండియా ఆడే మ్యాచులు మాత్రం దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇండియా ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 23న పాకిస్థాన్‌తో మార్చి 2న న్యూజిల్యాండ్‌తో తలపడనుంది. మార్చి 4న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మార్చి 9న జరగనుంది.దీంతో భారత జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మెగాటోర్నీ ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడితే.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడతారని, మ్యాచ్‌లు ఆడకపోతే మన టీమ్‌కే ఎక్కువ నష్టం అని కామెంట్లు పెడుతున్నారు.వామప్ మ్యాచ్ వద్దని బీసీసీఐ చెప్పి నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల పై హెవీ వర్క్‌లోడ్ పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 12నే ఇంగ్లాండ్ జట్టుతో భారత్ మూడో వన్డే ఆడింది. 15న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈ బయలుదేరనుంది. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. కాబట్టి మధ్యలో వార్మప్ మ్యాచ్ ఆడితే ఆటగాళ్లు అలసిపోయే అవకాశం ఉందని బీసీసీఐ భావించిందట. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్‌లు వద్దని చెప్పిందట.
![]() |
![]() |