కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన బిల్లు-2025ను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది.విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.
![]() |
![]() |