కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం లో గల ఆంజనేయ స్వామి ఆలయం పాలకవర్గం చైర్మన్ గా కొంత మంది వారికి వారే ప్రకటించుకొని, చందాలు వసూళ్లు చేయడం మంచిది కాదని కోదాడ మాజీ సర్పంచ్ యెర్నేని బాబు మండిపడ్డారు.. గురువారం శ్రీరంగాపురంలోని ఆంజనేయస్వామి గుడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...అనధికార వ్యక్తులు ఆజమాయిషి చెలాయిస్తూ,గుడి పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దని అన్నారు.
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఖరారు చేసిన వ్యక్తులు చైర్మన్ గా, పాలకవర్గంగా కొనసాగాలని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో కుర్రి గోపులు యాదవ్ ను గుడి చైర్మన్ గా ప్రకటించడం జరిగిందని వారే అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని సూచించారు.గుడి అభివృద్ధి పేరుతో గతంలో ఉన్నవారు చందాలు వసూలు చేస్తున్నారని అటువంటి వారికి ప్రజలు సహకరించవద్దని కోరారు. అధికారికంగా నియామకం కాబడిన పాలకవర్గానికి ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గుడి అభివృద్ధికి 100% కట్టుబడి ఉన్నామని, దానికి ప్రతి ఒక్కరి కృషి కావాలని కోరారు..