ఎర్రగొండపాలెం మేజరు పంచాయతీలో శివారు కాలనీలైన ఎన్టీఆర్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు జోక్యంతో గురువారం పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పైపులైన్ నిర్మాణపు పనులు ప్రారంభించారు. ఈ పనులకు గ్రామపంచాయతీ నిధులు నుంచి రూ.3 లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ పైపులైన్ నిర్మాణంతో ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మకాలనీ, బలపాలప్యాక్టరీ కాలనీలకు సాగర్‌జలాలతో తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చాలని ఇటీవల రెండు కాలనీల మహిళలు ఖాళీ బిందెలతో ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa