2025 చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ స్వదేశంలో జరిగిన వన్డే ట్రై సిరీస్ లో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ ఫైనల్ మ్యాచ్ లో డేవాన్ కాన్వే మిచెల్, కేన్ మామ, లాతమ్ అందరూ సమిష్టిగా రాణించడంతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది న్యూజిలాండ్. రచిన్ రవీంద్రా లాంటి ఆల్ రౌండర్ లేకపోయినా ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము లేపింది. ఇక అటు స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు వన్డే ట్రై సిరీస్ ఓడిపోయి మరింత ప్రెషర్ లోకి వెళ్ళింది పాకిస్తాన్. సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఇందులో సౌత్ ఆఫ్రికా ఎలిమినేట్ కాగా పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ ఫైనల్ కు చేరాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అత్యల్ప స్కోరు చేయగలిగింది. 49.3 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ టీమ్.. 242 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
పాకిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘ, తాహిర్ మినహా ఏ బ్యాట్స్మెన్ కూడా పెద్దగా రాణించలేదు. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు బాబర్ అజాం ఈ వన్డే ట్రై సిరీస్ లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు చేయగా సల్మాన్ 45 పరుగులు చేసి రాణించాడు. అటు తాహీర్ 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో అయినా రాణిస్తాడు అనుకున్న బాబర్ అజాం 29 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ తరుణంలోనే 242 పరుగులు మాత్రమే చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఇచ్చిన టార్గెట్ ను 45.2 ఓవర్లలో ఫినిష్ చేసింది న్యూజిలాండ్. కేవలం 5 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ జట్టు 243 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ కి ఈ విజయం చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి బలం గా నిలుస్తుంది. సొంత గడ్డపై ఓటమి పాకిస్థాన్ కి ఎదురు దెబ్బ లాంటిది.
![]() |
![]() |