నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ఇవాళ (శనివారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి హాజరవుతారు. దూబగుంట గ్రామంలో స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది.ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరు బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.05 దూబగుంట శివారులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభిస్తారు. 12.20 గంటలకు దూబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 1.30 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. 2.40 గంటలకు సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి బయలు దేరి వెళ్లనున్నారు.
![]() |
![]() |