తెల్లవారుజామున మంచుదట్టంగా కురుస్తోంది. ఏలూరు నగర సమీపంలో ఉదయం 8 గంటలకూ మంచు కురుస్తుండటంతో వాహనచోదకులు ఇబ్బందిపడుతూనే ప్రయాణం సాగించారు. మధ్యాహ్నం అయ్యే సరికి ఎండ మండిపోతోంది. నూజివీడు ట్రిఫుల్ ఐటీ విద్యార్థినులు 12 గంటల సమయంలో ఎండ తీవ్రతకు ఇలా గొడుగులు వేసుకుని వెళ్లారు.రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. శుక్రవారం కర్నూలులో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో వాయువ్య భారతం నుంచి మధ్యభారతం మీదుగా పొడిగాలులు వీస్తుండడంతో రాత్రి పూట చలి పెరిగింది. శివారు, ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఎండ ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
![]() |
![]() |