2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరనుండి వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీల నేతలపై, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీనటి శ్రీరెడ్డి పై కూడా కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సినీనటి విమల మల్లిడి అలియాస్ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
![]() |
![]() |