2025 డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బొయిలింగ్ ఎంచుకోడా.. ముంబై బాటింగ్ కి బరిలో దిగింది. ముంబయి 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. నాట్ సీవర్ (80* పరుగులు; 59 బంతుల్లో: 13x4) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42 పరుగులు, 22 బంతుల్లో) రాణించింది. జట్టు స్కోరులో దాదాపు 80శాతం పరుగులు ఈ ఇద్దరివే కావడం గమనార్హం. మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. దిల్లీ బౌలర్లలో సుదర్లాండ్ 3, శిఖా పాండే 2, కాప్సె, మిన్ను మని చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
165 పరుగుల లక్ష్య ఛేదనను దిల్లీ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (43 పరుగులు, 18 బంతులు) బౌండరీలతో విరుచుకుపడింది. దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలోనే జట్టు స్కోర్ 60కు చేర్చింది. ఇక 5.5 వద్ద మ్యాథ్యూ హేలీ బంతికి క్యాచౌట్‌గా వెనుదిరిగింది. దీంతో దిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ మెగ్ లానింగ్ (15)ను షబ్నమ్ క్లీన్ బౌల్డ్ చేసింది.ఈ మ్యాచ్ ఆఖరివరకు ఎంతో ఉత్ఖంఠంగా జరిగింది.
#TATAWPL
Last Over Classic@DelhiCapitals hold their nerves and win on the very last ball of the match
Scorecard ▶ https://t.co/99qqGTKYHu#MIvDC pic.twitter.com/rvxAdfrlUr
— Women's Premier League (WPL) (@wplt20) February 15, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa