కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకుసిర్పూర్ నియోజకవర్గం చింతలమనేపల్లి మండలం బాబాసాగర్ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై చిoతలమానేపల్లి పోలీస్ స్టేషన్ పరిిదిలో దాడులు నిర్వహించారు. చింతలమానెపల్లి ఎస్ఐ నరేష్ కు వచ్చిన సమాచారం మేరకు చింతలమానేపల్లి ఎస్ఐ నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలసి ఆదివారం సాయంత్రం బాబసాగర్ & డబ్బా గ్రామ శివారుల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 16మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4500నగదును , ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. 16మందిపై కేసు నమోదు చేశామన్నారు..అదే విధంగా చింతలమానేపల్లిమండలంలో ఎక్కడైనా పేకాట ఆడినట్లు తెలిస్తే 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.
![]() |
![]() |