ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేటా అంశంపై గవర్నరుకు పిర్యాదు చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 06:20 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని రాజ్ భవన్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీ ప్రజల డేటాను సీఎం చంద్రబాబు దొంగిలించారని, సైబర్ క్రైమ్ కి పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని జగన్ గవర్నర్ ను కోరారు. రెండేళ్లుగా చంద్రబాబు ఎన్నికలకు మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఐటీ గ్రిడ్ సంస్థతో చంద్రబాబు సైబర్ క్రైమ్ కి పాల్పడ్డారని చెప్పారు. టీడీపీ సేవామిత్ర యాప్ తో ప్రజలు డేటాను దోచుకున్నారని, ఆధార్ తో సహా ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను సేవామిత్రతో అనుసంధానం చేసుకున్నారని, ఇది నేరం కాదా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa