దేవుడిని పూజించే ప్రతి భక్తుడికీ సహజ సిద్ధమైన గమ్యస్థానంగా తిరుపతి ఆవిర్భవించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలనే ఉద్దేశంతో 1985-86లో అప్పటి సీఎం ఎన్టీఆర్ శ్రీవారి అన్నదాన ట్రస్టు ఏర్పాటు చేశారని, ఇపుడా ట్రస్టుకు విరాళాల రూపంలో రూ.3 వేల కోట్ల కార్పస్ ఫండ్ చేరింది. దీనిపై వచ్చే వడ్డీతో తిరుమల, తిరుపతిల్లో టీటీడీ భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేస్తోందన్నారు. తాను సీఎంగా గతంలో ప్రారంభించిన శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు ఇపుడు రూ.440 కోట్లు వచ్చాయని చెప్పారు. ఆ నిధులతో టీటీడీ ఎందరికో ప్రాణదానం చేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ.. హిందువులున్న ప్రతిదేశంలోనూ శ్రీవారి ఆలయాలు ఉండాలి. తిరుమలలో 75 శాతం గ్రీన్ కవర్ ఉంది. అక్కడ పర్యావరణాన్ని కాపాడేందుకు మరింత పెద్దఎత్తున చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుపతిలో ఐటీసీఎక్స్ నిర్వహిస్తున్న రెండో సదస్సుకు వచ్చిన ముఖ్యులకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ ఈవోకు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa