కూటమి నేతల అక్రమ కేసులతో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచింది. కొద్దిసేపటి క్రితమే పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వంశీతో ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. వైయస్ జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ లోపలికి వెళ్లారు. వైయస్ జగన్ రాక సందర్భంగా జైలు వద్ద కోలాహలం నెలకొంది. కాగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన నేపథ్యంలో వంశీ ఉంటున్న జైల్ వద్దకు వైయస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జైలు వద్ద అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలు పరిసరాలకు 500 మీటర్లలోపు ఎవరినీ ఉండనివ్వకుండా వెళ్లగొడుతున్నారు. తొలుత జైలు వద్దకి వచ్చిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కారును అడ్డుకుని.. ఆమెను నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లనూ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు.. మీడియా ప్రతినిధులను కూడా అక్కడ ఉండనివ్వకుండా పోలీసులు దూరంగా పంపించి వేస్తుండడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa