తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ ఇన్ని కుట్రలు చేయాలా అని వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకురాలు, మాజీ ఎంపీ వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని మున్సిపల్ కౌన్సిల్ లో వైయస్ఆర్‌సీపీకి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారడంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు.
30 మందిలో ప్రస్తుతం 28 మంది కౌన్సిలర్లు ఉన్నారని చెప్పారు. వైయస్ఆర్‌సీపీకి సంపూర్ణ మద్ధతుఉన్నా టీడీపీ కుట్రలు చేయడం సరికాదన్నారు. పోలీసులు వైయస్ఆర్‌సీపీ నేతలపై ఆంక్షలు విధిస్తున్నారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్ సుధాబాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. మేమంతా ఆమెను పరామర్శిస్తామన్నా పోలీసులు అంగీకరించడం లేదని వంగా గీత ఆక్షేపించారు. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా జరగాలని ఆమె డిమాండు చేశారు.
![]() |
![]() |