రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం పాణ్యం మండలంలోని జాతీయ రహదారిపై గల ప్రమాద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని బలప నూరు, సుగాలిమెట్ట, తమ్మరాజుపల్లె గ్రామ ప్రజలు పీడీకి వినతి పత్రాలు అందజేశారు. మండలంలోని తమ్మరాజుపల్లె వద్ద గల అడ్డ వాగు వంతెన, మరో వంతెనను వెడల్పు చేయాలని కోరారు. పీడీ మాట్లాడుతూ పాణ్యం పరిధిలోని ఎస్ టర్నింగ్, పాణ్యం డొంగు, సుగాలిమెట్ట, బలపనూరు ప్రారంతాలలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయాప్రాంతాల వద్ద బారికేడ్లు, సీసీ కెమెరాలు, జిగ్‌జాగ్ బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదిస్తామన్నారు. నంద్యాల ఎస్డీపీవో జావళి ఆల్ఫన్స్, రూట్ ఆఫీసర్ నరేశ్వరరెడ్డి, రూట్ మేనేజరు మధుసూదన్, సీఐ కిరణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కరరెడ్డి, టీడీపీ నాయకులు శివశంకరరెడ్డి, దేవదత్తు, బాలస్వామిరెడ్డి, తిరిపాల్ నాయక్ ఉన్నారు.
![]() |
![]() |