అంగనవాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటుగా గ్రాట్యూటీ అమలు చేయాలని అంగనవాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్ యూని యన(సీఐటీయూ) ఆధ్వర్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తంబళ్లపల్లెలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన సెంటర్లుగా మార్చుతూ జోవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స రూపొందించి అమలు చేయాలన్నారు. సాధికార సర్వేలో అంగనవాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అన్న పదం తొలగిం చి, సంక్షేమ పథకాలను అమలుచేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఓబుల్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్లు గౌరి, కరుణశ్రీ, సులోచన, స్వరూపా రాణి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |