రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటిని కేంద్రమంత్రి మర్యాదపూర్వకంగా కలిసారు. ఆలపాటిని గెలిపిస్తే ఉపాధ్యాయులు, యువత సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa