తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ,తిరుపతి,సూళ్లురుపేట,కావలి నిలువగా తెలంగాణ నుంచి సిద్దిపేట,సిరిసిల్ల,బోడుప్పల్ నిలిచాయి. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్ ఈ ఘనతను దక్కించుకుంది. అత్యంత స్వచ్ఛమైన రాజధానిగా భోపాల్ నిలిచింది. స్వచ్ఛత కోసం పాటుపడుతున్న టాప్ -3 రాష్ట్రాలుగా ఛత్తీస్ గఢ్,మహారాష్ట్ర,ఝార్ఖండ్ లు నిలిచాయి. 1-3 లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరంగా న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిలువగా,3-10 లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరంగా ఉజ్జయిని నిలిచింది.10 లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో స్వచ్ఛమైన నగరంగా అహ్మదాబాద్ నిలిచింది.2019 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను రాష్ట్రపతి కోవింద్ బుధవారం(మార్చి-6,2019) ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ప్రధానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa