ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిటిడి ప్రాజెక్టులపై జెఈవో సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 09:26 PM

టిటిడిలోని హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఇతర ప్రాజెక్టులపై టిటిడి తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం బుధవారం తిరుపతిలోని శ్వేత భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వచ్చే ఏడాదికి ప్రాజెక్టులవారీగా చేపట్టనున్న కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ధర్మప్రచారంలో భాగంగా గ్రామస్థాయిలో భక్తిభావాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్ని రాష్ట్రాల నుండి కళాబృందాలు ప్రదర్శనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణలో భాగంగా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా కైంకర్యాలు నిర్వహించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. టిటిడి నిర్మిస్తున్న శ్రీవారి దివ్యక్షేత్రాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత మంది భక్తులు తెలుసుకునేందుకు వీలుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు పోస్టర్లు అంటించాలని, అమ్మవారి సంకీర్తనలు వినిపించాలని సూచించారు. 


 


అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు, హరివంశ ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు, ప్రచురణల విభాగం ప్రగతిని జెఈవో సమీక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa