మోదీ, కేసీఆర్, జగన్ అనే దొంగలు పడ్డారని, నవ్యాంధ్ర ప్రగతి వీరికి ఎవరికి ఇష్టం లేదని ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు బుధవారం నాడు మైలవరం లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఉమా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కలిసిన తర్వాత ఏపీలోని తెదేపా శ్రేణులకు సంబంధించిన ఓట్లను తొలగించాలనే కుట్రలకు, కుతంత్రాలు శ్రీకారం చుట్టారని, రెండేళ్లుగా వైకాపా సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఏపీలోని తెదేపా శ్రేణుల డేటాను సేకరించి తప్పుడు ఫిర్యాదు తో గుత్త మొత్తంగా ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అక్కడి అధికార టీఆర్ఎస్ పార్టీ 24 లక్షల ఓట్లు తొలగించి రాజకీయ లబ్ధి పొందిందని, అదే తరహాలో ఏపీలోనూ 54 లక్షల ఓట్లను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే ఫారం-7 తో ఫిర్యాదులు చేస్తున్నట్లు చెప్పటాన్ని గుర్తు చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి జుగుబ్సకరమైన చర్యలకు పాల్పడుతున్నారని దేశం శ్రేణులు అప్రమత్తంగా ఉండి, వైకాపా కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం సామాన్యునికి ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఎవ్వరూ తొలగించకూడదని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టువంటిదని మంత్రి ఉమా చెప్పారు. ప్రలోభాలతో, కుట్రలతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కలలు కంటున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కలలు పగటి కలలు మాత్రమేనని స్పష్టం చేశారు. అనంతరం మైలవరం వీధుల్లో మంత్రి దేవినేని ఉమా సారధ్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైకాపా కుట్రలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa