మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జెసి గరిమ అగర్వాల్ అన్నారు. మంగళవారం కోహెడ మండలంలోని కేజీబీవీ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత, టాయిలెట్స్ నిర్వహణ, వంట సామాగ్రి నిలువ, తరగతి గదుల నిర్వహణ, భోజన వసతుల ఏర్పాటు, విద్యార్థుల ఆరోగ్యం, నీటి సరఫరా, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంటు నిర్వహణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది, విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, సంబంధిత శాఖ అధికారులకు సూచించడం జరిగింది. విద్యార్థుల పరిశీలించడం కోసం విద్యార్థుల చేత గణితముకు సంబంధించిన లెక్కలను బోర్డుపై చేయించడం జరిగింది, గణితంలో పైథాగరస్ సిద్ధాంతం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని, సిద్ధాంతం యొక్క నిరూపణనను బోర్డుపై విద్యార్థుల చేత చేయించడం జరిగింది. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ఎప్పటికప్పుడు ఫార్మేటివ్, సమ్మెటివ్, ప్రాక్టీస్ టెస్టులు వ్రాస్తున్నారు, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ టెస్టులు వ్రాస్తూ ఉంటే, మీరు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో, ఇంకా ఎంత చదవాలో తెలుస్తుంది, ఇక్కడ ఉన్న అధికారులు అందరము ఎన్నో టెస్టులు రాసి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివితేనే ఈ స్థాయికి చేరుకున్నాము, కావున మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి ప్రణాళికతో, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు తీసుకుంటూ బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించడం జరిగింది.రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరారు.
పాఠశాలలో ఉన్న నీటి సమస్య, డార్మెటరీ సమస్య గురించి పాఠశాల యాజమాన్యం అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది, డార్మెటరీ మంజూరి అయినది త్వరలోనే నిర్మాణం చేపడతారని తెలుపుతూ, మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. అనంతరం తంగళ్ళపల్లి, శనిగరం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు చేశారు. శనిగరం అంగన్వాడి ఆవరణలో మొక్కలను నాటారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ హరీష్ కుమార్, తహసిల్దార్ సురేఖ, మండల వైద్యాధికారిణి డాక్టర్ నిమ్రా,మండల విద్యాధికారి పద్మయ్య, ఇన్చార్జి ఎంపిఓ శోభా, సిడిపిఓ జయమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత,పంచాయతీ కార్యదర్శి రమేష్, ప్రధానోపాధ్యాయులు హేమ బిందు, భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |