ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరికి 360 సంవత్సరాలు, వందేళ్లు దాటిన వారు 2 కోట్లకు పైనే

international |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 11:15 PM

ఈమధ్య కాలంలో మనుషులు సగటు ఆయుర్ధాయం 60 ఏళ్లకు తగ్గిపోయింది. ఒకప్పుడు 100 ఏళ్లు దాటి సులువుగా బతికేసేవారు. కానీ ఇప్పుడు 40 ఏళ్లు రాగానే అనేక రోగాలు, నొప్పులతో ఇబ్బంది పడుతూ.. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడో కొంత మంది మాత్రమే అంతకు మించి బతుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ అగ్రరాజ్య అమెరికా ప్రజలు మాత్రం సులువుగా 100 ఏళ్లకు పైగా బతికేస్తున్నారట. అలా అని ఆ సంఖ్య పదుల్లో ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏకంగా 100 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 2 కోట్లకు పైగా ఉండగా.. 360 ఏళ్లు దాటిన ఓ వ్యక్తి ఇప్పటికే బతికే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో వందేళ్లు దాటిన వారు 2 కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు చెప్పారు. అలాగే 360 నుంచి 369 ఏళ్ల వయసు కల్గిన వారు ఒకరు కాగా.. 240-249 మధ్య ఒకరు, 220-229 మధ్య 1039, 210-219 మధ్య 866, 200-209 మధ్య 879, 190-199 మధ్య 448, 180-189 మధ్య 695, 170-179 మధ్య 6087, 160-169 మధ్య 121,807, 150-159 మధ్య 13 లక్షల 45 వేల 83, 140-149 మధ్య 35 లక్షల 42 వేల 44, 130-139 మధ్య 39 లక్షల 36 వేల 311, 120-129 మధ్య 34 లక్షల 72 వేల 849, 110-119 మధ్య 36 లక్షల 27 వేల 7, 100-109 మధ్య 47 లక్షల 34 వేల 407 మంది ఉన్నట్లు వెల్లడించారు.


వాస్తవానికి సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని మస్క్ తెలిపారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసం అని ప్రకటించారు. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్‌లో దాదాపు 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు. అయితే వీరంతా ఆదాయం పొందడం, లబ్ధిని స్వీకరించడం వంటివి ఏమీ చేయట్లేదు. అంటే వీరంతా చనిపోయినట్లు లెక్క. కానీ దీన్ని సోషల్ సెక్యూరిటీ డేటాలో నమోదు చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు మస్క్ చెప్పుకొచ్చారు.


ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే వీరు ప్రాణాలు కోల్పోగా.. ఇవి అప్‌డేట్ చేయడం సాధ్య పడలేదని ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీని కారణంగానే వందేళ్లు దాటిన వ్యక్తులు 2 కోట్ల మంది బతికి ఉన్నట్లు రికార్డు అయిందని స్పష్టం చేశారు. ఇక అధికారిక జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య కేవలం 86 వేల మాత్రమేనన్నారు. ప్రస్తుతం మస్క్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. అమెరికా చాలా గ్రేట్.. అందుకే 2 కోట్ల మంది 100 ఏళ్లకు పైగా బతికారంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa