ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు బుధవారం రాత్రి తెరపడింది. ఢిల్లీ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా పర్వేశ్ వర్మను ప్రకటించారు. అయితే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో సీఎంగా అవకాశం ఇవ్వండంపై రేఖ స్పందించారు. 'ఇది ఒక పెద్ద బాధ్యత. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీ, బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదలు' అని తెలిపారు.ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా నిలిచారు. గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీలు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. రేఖా గుప్తాకు రెండేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆమె.. కౌన్సిలర్‌గా పనిచేశారు. 2015, 2020 ఎన్నికల్లో పోటీచేసినా.. ఓటమి ఎదుర్కొన్నారు. ఈసారి అదే ప్రత్యర్థిని ఓడించి.. ఏకంగా సీఎం అయ్యారు. అయితే, సీఎం అవుతోన్న రేఖా గుప్తా వ్యక్తిగత వివరాలు, ఆస్తుల గురించి తెలుసుకోడానికి ఆసక్తిచూపుతున్నారు.
![]() |
![]() |