వైసీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని గురువారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైసీపీ నాయకులు కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రిగా వైఎఎస్ జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందని, అయితే ఆయనకు ఎక్కడకు వెళ్లినా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని తెలిపారు. జగన్ భద్రతపై తమకు ఆందోళనగా ఉందని, రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైసీపీ నేతలు గవర్నర్ ను కోరారు. జగన్ పర్యటనలో అనేక భద్రతా వైఫల్యాలు కనిపించాయని వారు తెలిపారు.శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్, మాజీ మంత్రులు అంబటి, మేరుగ, వెల్లంపల్లి, కారుమూరు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
![]() |
![]() |