ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో దాడులకు జెఇఎంను ఉపయోగించిన ఐఎస్‌ఐ : ముషార్రఫ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 10:50 AM

భారతదేశంలో దాడులకు ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ-మహ్మద్‌ (జెఇఎం) ను పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఐఎస్‌ఐ ఉపయోగించుకుందని పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్‌లో దాడులకు జెఇఎంను ఐఎస్‌ఐ ఉపయోగించుకుందని పాక్‌ జర్నలిస్టు ఒకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. కాగా జెఇఎంపై పాకిస్తాన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. 2003లో రెండుసార్లు తనను హత్య చేయడానికి జెఇఎం ప్రయత్నించిందని ఆయన చెప్పారు. ఆ సంస్థపై మీరెందుకు చర్యలు తీసుకోలేదని అడిగిన ప్రశ్నకు అప్పటి పరిస్థితులు ”వేరు”గా ఉన్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa