ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కి హాని కలిగించేలా ప్రభుత్వం కుట్రలు చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 10:25 AM

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఏదైనా హాని జ‌రిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంద‌ని, ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి టీడీపీ కూట‌మి స‌ర్కార్ గురికావాల్సి వ‌స్తుంద‌ని క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. గుంటూరు మిర్చి యార్డును సంద‌ర్శించిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం వైయ‌స్ జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఎస్వీ మోహ‌న్ రెడ్డి క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు. `మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి పోలీస్ భద్రత కల్పించడంలో  కూటమి ప్రభుత్వం విఫలమైంది. వైయ‌స్ జగన్ మోహన్ పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ఆయనకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నారా లోకేష్, చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భద్రత కల్పించింది. గుంటూరు ప‌ర్య‌ట‌న‌లో పోలీసు సిబ్బందిని కేటాయించకుండా దురుద్దేశంతో హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేత అని, ఆయ‌నకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహ‌న్ రెడ్డి డిమాండు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa