ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిసెర్చ్‌ విద్యార్థి మజ్జి షణ్ముఖనాయుడు స్పెయిన్‌లో మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 12:00 PM

విశాఖ :నగర పరిధిలోని నాయుడుతోట దుర్గానగర్‌కు చెందిన రిసెర్చ్‌ విద్యార్థి మజ్జి షణ్ముఖనాయుడు (25) స్పెయిన్‌లో మృతిచెందాడు. ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో షణ్ముఖనాయుడు మరణించినట్టు బుధవారం కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కాగా.. ఆదివారం ప్రమాదం జరిగితే బుధవారం సమాచారమివ్వడం ఏమిటని విద్యార్థి తండ్రి చిన్నమనాయుడు ప్రశ్నిస్తున్నారు.అక్కడ ఎవరో తమ కుమారుణ్ని చంపి ప్రమాదంగా చిత్రీకరించారనే అనుమానం కలుగుతోందన్నారు.చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణించే షణ్ముఖనాయుడు బెంగళూరులోని ఐఐఎ్‌సఈలో ఫిజిక్స్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. 


ఆ తర్వాత స్పెయిన్‌లో పీహెచ్‌డీ చేసేందుకు స్కాలర్‌షి్‌పనకు ఎంపికయ్యాడు.గతేడాది ఆగస్టులో బార్సిలోనాలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటానిక్‌ సైన్స్‌లో చేరాడు. తమ బిడ్డ మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేలా ఎంబసీ అధికారులు చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa