రాష్ట్రంలో గ్యాస్ సరఫరా కొరతను తీర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామాల్లో సిలిండర్ల డెలివరీ ఆలస్యంపై అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎల్‌పీజీ ఏజెన్సీలతో నిత్యం సమీక్షించాలని ఆదేశించారు. గ్యాస్ కొరతను తగ్గించేందుకు త్వరలో 5 కిలోల సిలిండర్ల పంపిణీకి కేంద్రం సిద్ధమవుతోందని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో కిరోసిన్ సరఫరా కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. సరఫరాలో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa