దివ్యాంగుల చట్టాలపై అవగాహన అవసరమని ఇటుకలపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇటుకలపల్లి పోలీ్‌సస్టేషనలో దివ్యాంగుల హక్కుల చట్టం రైట్స్ ఆఫ్ పర్సన్స విత డిజేబులిటీస్ ఆర్‌పీడబ్ల్యూడీ-2016 తెలుగు అనువాద పుస్తకాన్ని ఎస్‌ఐ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపిందన్నారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమతి ఉమ్మడిజిల్లాల కోఆర్డినేటర్ మాట్లాడుతూ సెక్షన 91(ఏ) ప్రకారం దివ్యాంగ వ్యక్తిని ఎవరైనా కించపరిచే ఉద్దేశంతో ఏస్థలంలోనైనా బహిరంగానైనా అవమానించినా, భయపెట్టినా, దాడిచేసినా వారికి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తారన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు షఫీ, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి రసూల్, కాలాపరెడ్డి, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
![]() |
![]() |