ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు TTD రిలీజ్ చేయనుంది. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేవు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/ వెబ్ సైట్ లో కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది.శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ధగధగ మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు.
![]() |
![]() |