ఈ రోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం కావడంతో ఈ రోజు సభకు రావాలని నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి తదనంతర కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మంగళ, బుధవారం కడప జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. ఏ సభ్యుడైనా సభకు 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వస్తున్నారని కూటమి నేతల నుండి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa