బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలోని సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఒకరి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్ (30) గా గుర్తించారు. బాధితుడిని కాల్చి చంపినట్లు సమాచారం. భూ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా వైమానిక దళ సిబ్బందికి, స్థానిక నివాసితులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.కోక్స్ బజార్‌లోని ఆ దేశ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దుండగులు దాడికి (attack) పాల్పడినట్లు బంగ్లాదేశ్ సాయుధ దళాల పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగినట్లు వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa