ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ టారిఫ్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి

business |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 05:07 PM

దేశీయ స్టాక్ మార్కెట్లను మరో బ్లాక్ మండే కుప్పకూల్చింది. ట్రంప్ టారిఫ్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరయింది.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454కి పడిపోయింది. నిఫ్టీ 242 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 4 పైసలు క్షీణించి రూ. 86.72 వద్ద ముగిసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa