రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబం ఆర్ధికంగా ఎంతో నష్టపోతుందని, కుటుంబ పెద్ద తీవ్రంగా గాయపడితే కుటుంబ సభ్యుల మనోవేదన లాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదని కడప ట్రాఫిక్ సిఐ జావేద్ అన్నారు.
సోమవారం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.
![]() |
![]() |