అఖిల భారత మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం గెలుచుకున్న ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీడాకారిణి గుజ్జుల వర్షితను, వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడా ప్రతిభ, నైపుణ్యత ద్వారా వర్శిటీకు, జిల్లాకు పేరు తీసుకువచ్చినందుకు ప్రశంసించారు. ధర్మశాలలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన పోటీల్లో 64కేజీల కేటగిరిలో విజయం సాధించారు.
![]() |
![]() |