మహాశివరాత్రి శివ భక్తులకు కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం శివరాత్రి సందర్భంగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ వద్ద మంగళవారం భక్తులు స్నానాలు ఆచరించే విధంగా జల్లు స్థానాలను ఏర్పాటు చేశారు. స్థానాల అనంతరం దుస్తులు మార్చుకునేందుకు గుడారాన్ని ఏర్పాటు చేశారు. పవిత్ర సంగమం వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించారు. నీటిలో పాకుడు పట్టిన మెట్లకు బ్లీచింగ్ జల్లారు.
![]() |
![]() |