శివరాత్రి సందర్భంగా జాగరణ ఉన్న భక్తులంతా గురువారం సముద్ర స్నానాలను ఆచరించారు. తెల్లవారుజాము నుంచి విశాఖలోని ఆర్కే బీచ్ , రుషికొండ, సాగర్ నగర్ సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు వేలాదిమంది తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తుల సౌకర్యం జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సముద్ర స్నానాలు అనంతరం సమీప ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.విశాఖ ఆర్కే బీచ్ లో సందర్శకుల సందడి ఎక్కువగా ఉంది. రాళ్లపై నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. బీచ్‌లో ఎగిసిపడే అలలను చూసి పెద్దలు కూడా పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.
![]() |
![]() |